Hyderabad: అడగ్గానే టీ ఇవ్వలేదని కోడలిని గొంతు నులిమి చంపిన అత్త!

Hyderabad Woman Strangled By Mother In Law After Dispute Over Tea Cops

టీ అడగ్గానే ఇవ్వలేదని ఓ మహిళ తన కోడలిని గొంతు నులిమి చంపేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. మృతురాలిని పోలీసులు 28 ఏళ్ల అజ్మీరీ బేగంగా గుర్తించారు. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, ఫర్జానా అనే మహిళ తన కోడలిని టీ అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో, ఆమె వెంటే వంటింట్లోకి వెళ్లిన ఫర్జానా చున్నీని వెనక నుంచి కోడలి గొంతుకు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అత్తాకోడళ్ల మధ్య కొంత కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని అన్నారు.

  • Loading...

More Telugu News