Mallu Bhatti Vikramarka: ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

Bhattivikramarka reaches Delhi
  • టీపీసీసీ అధ్యక్ష పదవిపై అధిష్ఠానం కసరత్తు
  • నాలుగు రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి
  • కాసేపట్లో అగ్రనేతలతో తెలంగాణ నేతల సమావేశం

తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవిపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో భట్టివిక్రమార్క దేశ రాజధానికి చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన వరుసగా కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలతో సమావేశమవుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. వీరు కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News