Hyderabad: తెలంగాణలో భారీ వర్షం... అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు

Heavy rain in Telangana including Hyderabad
  • హైదరాబాద్‌లో వర్షానికి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
  • ఫ్లైఓవర్ల కింద నిలిచిన వాహనదారులు
  • వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రంగంలోకి జీహెచ్ఎంసీ

తెలంగాణలో భారీ వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనదారులు ఆగిపోయారు. ఫ్లైఓవర్ల కింద వాహనాలు నిలిపారు.

కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్, రామంతాపూర్, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది.

  • Loading...

More Telugu News