KTR: కల్వకుంట్ల డ్రామారావా... అంటూ తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్!

Telangana Congress counter to KTR
  • సీతారామ ప్రాజెక్టుపై ట్వీట్ చేసిన కేటీఆర్
  • మీ హయాంలో అవినీతితో ఆగమాగం చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్
  • ప్రజాప్రభుత్వం వచ్చాక ఆరు నెలల్లో పూర్తయ్యేలా కార్యాచరణ ప్రారంభించామని వ్యాఖ్య

సీతారామ ప్రాజెక్ట్ ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరు అందనుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‍‌పై 'తెలంగాణ కాంగ్రెస్' ఎక్స్ హ్యాండిల్ స్పందించింది. 'కల్వకుంట్ల డ్రామారావా!' అంటూ ట్వీట్ చేసింది. 2014 లోనే రూ.3000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని, మీ కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతో రూ.18,500 కోట్లకు పెంచి పదేళ్లు ఆలస్యం చేశారని పేర్కొంది.

ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల్లో, భూ సేకరణలో, బాధితులకు పునరావాసం అందించడంలో నిర్లక్ష్యం చేసి, మీరు మాత్రం అందినకాడికి దోచుకున్నారని ఆరోపణలు గుప్పించింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక జనవరి 7, 2024 నాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్ట్ పురోగతిపై రివ్యూ నిర్వహించి, ఆరు నెల్లలో పనులు పూర్తయ్యేలా కార్యాచరణ ప్రారంభించారని పేర్కొంది. దాని ఫలితమే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ గోదావరి జలకళ అని పేర్కొంది.

అవినీతితో ఆగమాగం ప్రాజెక్టులు కట్టి, పడగొట్టడం, పంపుహౌజులను కట్టి, వరదతో ముంచెత్తడం, మంచిచేసే వారిపై దుష్ప్రచారాలతో బురద జల్లడమే మీకు తెలుసునని ఎక్స్ వేదిగా విమర్శలు గుప్పించింది. 'ఇప్పుడు చెప్పు.. కాంగ్రెస్ వస్తే ఏమొచ్చే! ఎగిసిపడే గోదావరమ్మ జల కళ వచ్చే! తెలంగాణ రైతన్నల జీవితాల్లో వెలుగొచ్చే!' అని పేర్కొంది. కాగా, సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తై... ఈరోజు ట్రయల్ రన్‌ను నిర్వహించింది.

  • Loading...

More Telugu News