Sitarama Project: సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్‌.. ఇదిగో వీడియో!

Successful Trial Run of Sitarama Project

  • గత కేసీఆర్ ప్రభుత్వంలో 17 వేల కోట్ల అంచనాతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు
  • ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు సాగు నీరు
  • సీతారామ ప్రాజెక్టుకు 2016 ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేసిన మాజీ సీఎం కేసీఆర్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్‌ అయింది. ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వ‌ద్ద‌ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులతో కలిసి మోటార్ల ట్రయల్‌ రన్‌ను పర్యవేక్షించారు. ట్రయల్‌ రన్ విజయవంతం కావడంతో మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది.

సీతారామ ప్రాజెక్టుకు 2016 ఫిబ్రవరి 16న మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై దుమ్ముగూడెం దిగువన సీతమ్మ సాగర్‌ బ్యారేజ్‌ నిర్మాణం చేసి 70 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. రూ. 17 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు. కాగా, ఈ ప్రాజెక్టు పనులు కేసీఆర్‌ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి.

More Telugu News