Farmer Passbook: ఏపీలో లక్షలాది రైతు పాస్ పుస్తకాలు వెనక్కి.. రాజముద్రతో మళ్లీ పంపిణీ

AP govt to recall 20 lakh farmer passbooks

  • ఎన్నికల కోడ్‌కు ముందు 20.19 లక్షల పాస్ పుస్తకాల పంపిణీ
  • జగన్ ఫొటోతో ‘జగనన్న భూ హక్కు పత్రం’ పేరుతో అందజేత
  • పాత పద్ధతిలోనే డిజైన్ చేసి అధికారిక ముద్రతో పంపిణీ చేయనున్న ప్రభుత్వం
  • సర్వే రాళ్లు కూడా మార్చాలని నిర్ణయం

జగన్ ప్రభుత్వంలో ఆయన ఫొటోతో పంపిణీ చేసిన 20.19 లక్షల పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘జగనన్న భూ హక్కు పత్రం’ పేరుతో పంపిణీ చేసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకుని వాటిని పాత పద్ధతిలోనే డిజైన్ చేసి రాజముద్రతో పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు భూ పరిపాలనశాఖ ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్, సర్వేశాఖ కమిషనర్ సిద్దార్థ్ జైన్‌తో నిన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చించారు. 

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు జగన్ ప్రభుత్వం రూ. 20.19 లక్షల భూహక్కు పత్రాలను పంపిణీ చేసింది. మరో లక్ష పంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పంపిణీ చేసిన వాటిని వెనక్కి తీసుకుని, ఉన్నవాటిని నిలిపివేసి కొత్తగా డిజైన్ చేసి అధికారిక ముద్రతో పంపిణీ చేయనున్నారు. అలాగే, గత ప్రభుత్వం జగనన్న పేరుతో ఆయన ఫొటోతో 74.65 లక్షల రాళ్లను పొలాల వద్ద పాతింది. వీటిని కూడా తొలగించి కొత్త సర్వే రాళ్లను పాతాలని ప్రభుత్వ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News