Lancet Study: భారతీయుల్లో సగం మంది ఫిజికల్ గా అన్ ఫిట్: లాన్సెట్ స్టడీ

Half of Indias Adults Not Physically Active Lancet Study Reveals Alarming Trend
  • పద్దెనిమిదేళ్లు పైబడ్డ వారు శారీరక శ్రమ మర్చిపోతున్నారంటున్న స్టడీ  
  • వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ చేయాలంటున్న డబ్ల్యూహెచ్ వో
  • 197 దేశాలలో సర్వే నిర్వహించిన లాన్సెట్

ఉదయాన్నే జాగింగ్.. సాయంకాలం పూట వాకింగ్.. దగ్గరి దూరాలకు కాలినడకన వెళ్లిరావడం వంటివి ఆరోగ్యకరమైన అలవాట్లు.. కానీ, భారతీయుల్లో చాలామంది వీటి మాటే ఎత్తడంలేదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. జాగింగ్, వాకింగ్ కాదుకదా శరీరానికి నొప్పి తెలవనివ్వడంలేదట.. వారానికి 150 నిమిషాల మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదని తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా జరిపిన సర్వేలో భారతీయుల శారీరక శ్రమ గురించి కీలక విషయాలు బయటపడ్డాయి. గ్లోబల్ హెల్త్ జర్నల్ లాన్సెట్ సంస్థ నిర్వహించిన ఈ స్టడీలో దాదాపు సగం మంది ఫిజికల్ గా అన్ ఫిట్ అని తేలింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సూచనల ప్రకారం.. పద్దెనిమిదేళ్లు పైబడిన వారు(అడల్ట్స్) వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అంతకంటే తగ్గితే దానిని ఫిజికల్ ఇన్ యాక్టివ్ గా పరిగణిస్తారు. దీనిని ఆధారంగా చేసుకుని 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది. ఇందులో భారతీయులు దాదాపు 50% మంది ఫిజికల్లీ అన్ ఫిట్ అని తేల్చింది. వీరిలో మహిళలు 57%, పురుషులు 42 శాతంగా ఉన్నారని వివరించింది. 2000 సంవత్సరంలో భారతీయుల్లో 22% ఫిజికల్లీ అన్ ఫిట్ గా ఉండగా, 2010 నాటికి ఇది 34 శాతానికి, 2022 నాటికి 50 శాతానికి పెరిగిందని తెలిపింది.

ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఇది 60 శాతం దాటుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 31.3 శాతం మంది అడల్ట్స్ ఫిజికల్లీ అన్ ఫిట్ గా ఉన్నారని స్టడీలో తేలింది. ఫిజికల్లీ అన్ ఫిట్ విషయంలో ఫస్ట్ ప్లేస్ లో ఆసియా పసిఫిక్ రీజియన్ ఉందని, దక్షిణాసియా రెండో స్థానంలో ఉందని లాన్సెట్ పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడిన వారు కూడా తగినంత శారీరక శ్రమ చేయడంలేదని వివరించారు.

  • Loading...

More Telugu News