Realme: రూ.8 వేల లోపు ధరకే రియల్‌మీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌

Realme is all set to launch a new budget smartphone Realme C61 in India

  • రేపు మధ్యాహ్నం (శుక్రవారం) 12 గంటలకు రియల్‌మీ సీ61 స్మార్ట్‌ఫోన్ విడుదల
  • రియల్‌మీ సీ61 స్మార్ట్‌ఫోన్ 4జీబీ + 64జీబీ వేరియెంట్ ధర రూ.7,699గా నిర్ణయం
  • ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం

బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ అన్వేషించేవారికి గుడ్‌న్యూస్. భారత మార్కెట్‌లో సరికొత్త బడ్జెట్ ఫోన్ రియల్‌మీ సీ61ను విడుదల చేసేందుకు స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ సిద్ధమైంది. జూన్ 28న (శుక్రవారం) ఈ ఫోన్‌ను ఆవిష్కరించనుంది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై చక్కటి ఆదరణ పొందిన రియల్‌మీ సీ51కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను కంపెనీ విడుదల చేస్తోంది.

రియల్‌మీ సీ61 స్మార్ట్‌ఫోన్ 4జీబీ + 64జీబీ మోడల్‌ ధర రూ.7,699గా ఉంది. ఇక 4జీబీ + 128జీబీ ధర రూ.8,499, 6జీబీ + 128జీబీ వెర్షన్‌ల ధర రూ. 8,999గా ఉన్నాయి. కస్టమర్లు అదనపు డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు 6జీబీ + 128జీబీ వేరియంట్‌ ఫోన్2పై రూ. 900 తగ్గింపు పొందవచ్చు. ఈ వేరియెంట్ ఫోన్ ధర ఆన్‌లైన్‌లో రూ.8,099గా ఉంటుంది. 

రియల్‌మీ సీ61 ఫోన్ మొదటి సేల్ జూన్ 28న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై జూలై 2న ముగుస్తుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌పై విక్రయాలు కొనసాగుతాయి. ఇక ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో జూలై 1న సేల్స్ ముగుస్తాయి. అయితే ఆఫ్‌లైన్‌లో 4జీబీ వేరియంట్‌ ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఫీచర్లు ఇవే..
రియల్‌మీ సీ1 స్మార్ట్‌ఫోన్ యూనిసాక్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 8జీబీ వరకు ర్యామ్ స్టోరేజీ ఆప్షన్ ఉంటుంది. ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్‌గా ఉంది. ఇక 32-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఫోన్ మందం 7.84ఎంఎంగా ఉంది. ఫోన్ బరువు 187 గ్రాములుగా ఉంది. ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్, టీయూవీ రైన్‌ల్యాండ్ హై-రిలయబిలిటీ సర్టిఫికేషన్‌తో ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. ఇక మార్బుల్ బ్లాక్, సఫారీ గ్రీన్ రంగులలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

  • Loading...

More Telugu News