LK Advani: ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ

former Deputy PM and BJP Veteran leader LK Advani admitted to AIIMS in Delhi

  • వృద్ధాప్య సమస్యలతో చేరిక
  • ఆరోగ్యం బాగానే ఉందని తెలిపిన కుటుంబ సభ్యులు
  • వృద్ధాప్య సమస్యల నిపుణుల పర్యవేక్షణలో ఉన్న బీజేపీ కురువృద్ధుడు

మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా ఆయన అడ్మిట్ అయ్యారు. వృద్ధాప్య సమస్యల విభాగానికి సంబంధించిన వైద్యుల పర్యవేక్షణలో అద్వానీ ఉన్నారు. కాగా ఆయన ఆరోగ్యం బాగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

అద్వానీ రాజకీయ జీవితం విషయానికి వస్తే, కేంద్ర హోం మంత్రిగా, ఉప ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయి (1999-2004) క్యాబినెట్‌లో బాధ్యతలు నిర్వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు అద్వానీని ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ ఎన్నికల్లో యూపీఏ-2 అధికారంలోకి వచ్చింది.

అద్వానీ నవంబర్ 8, 1927న కరాచీ (ప్రస్తుత పాకిస్థాన్)లో జన్మించారు. 1942లో స్వయంసేవక్‌గా ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా 1986 నుంచి 1990 వరకు, ఆ తర్వాత 1993 నుంచి 1998 వరకు, అనంతరం 2004 నుంచి 2005 వరకు అద్వానీ బాధ్యతలు నిర్వహించారు. 1980లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అత్యధిక కాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా అద్వానీ నిలిచారు.

  • Loading...

More Telugu News