Congress: ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఫేర్‌వెల్ పార్టీ చేసుకుంటున్నారు: ఆది శ్రీనివాస్

Adi Srinivas fires at ktr and kcr

  • 12 మంది కాంగెస్ ఎమ్మెల్యేలను విలీనం పేరిట చేర్చుకున్నారని ఆగ్రహం
  • అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను హీనంగా చూశారని విమర్శ
  • పేరు మార్చుకున్నప్పుడే ‌తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందన్న కాంగ్రెస్ నేత

ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఫేర్‌వెల్ పార్టీ చేసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... గతంలో విపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నప్పుడు కేటీఆర్‌కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. నాడు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం పేరిట బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజాసంక్షేమ పాలన చూసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ గేటు, ప్రగతి భవన్ గేటు తాకనివ్వని కేసీఆర్... ఈరోజు అదే ఎమ్మెల్యేలతో పార్టీ చేసుకుంటున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.

2014లో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌ను పార్టీలో చేర్చుకొని... ఆ తర్వాత మంత్రిగా చేసినప్పుడు కేటీఆర్ ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు. బీఆర్ఎస్‌గా పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణతో ఆ పార్టీకి పేగుబంధం తెగిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి తుపానులో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ... ఆ నావలో ఎవరూ ఉండరన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను హీనంగా చూశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి మరికొందరు రావడం ఖాయమని... చివరకు ఆ పార్టీలో నలుగురే మిగులుతారని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News