Purandeswari: ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది: పురందేశ్వరి

BJP MP Purandeswari FIRST REACTION On Lok Sabha Speaker
  • స్పీకర్ పోస్టుకు ఓం బిర్లాతో పాటు పురందేశ్వరి పేరును పరిశీలించినట్లు వార్తలు
  • ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికైన నేపథ్యంలో స్పందించిన బీజేపీ నేత
  • పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను చిత్తశుద్ధితో చేసుకుంటూ పోవడమే తనకు తెలుసని వ్యాఖ్య  

సీనియారిటీ, అనుభవం, సామర్థ్యం ఆధారంగా ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని బీజేపీ ఏపీ ప్రెసిడెంట్, ఎంపీ పురందేశ్వరి స్పష్టం చేశారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను చిత్తశుద్ధితో చేసుకుంటూ పోవడమే తనకు తెలుసని చెప్పారు. ఈమేరకు ఢిల్లీలో తనను పలకరించిన మీడియాతో పురందేశ్వరి మాట్లాడారు. కేంద్రంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి సర్కారులో టీడీపీ, బీజేడీ పార్టీలు కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్ సభ స్పీకర్ పోస్టు కోసం ఆ రెండు పార్టీలు ప్రయత్నించాయని ప్రచారం జరిగింది. దీంతోపాటు ఓ దశలో స్పీకర్ పోస్టుకు మాజీ స్పీకర్ ఓం బిర్లా పేరుతో పాటు పురందేశ్వరి పేరును కూడా బీజేపీ పెద్దలు పరిశీలించినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే బుధవారం స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. దీనిపై ఎలా స్పందిస్తారని అడిగిన మీడియా ప్రతినిధులకు జవాబిస్తూ.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ గా తాను సంతృప్తితో ఉన్నట్లు పురందేశ్వరి చెప్పారు. ఎవరు ఏమిటి.. ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ చూసుకుంటుందని వివరించారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా, ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకారం తెలపాల్సిన బాధ్యత పార్టీ నేతలుగా తమపై ఉందన్నారు. పార్టీలో సీనియర్ నేతలు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News