Sudha Murthy: అబ్దుల్ కలాం ఫోన్ చేస్తే ‘రాంగ్ నంబర్’ అని చెప్పా.. ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న సుధా మూర్తి

Once I received a call from Mr Abdul Kalam told me he reads my columns and enjoys them says Sudha Murthy

  • అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న నాటి ఘటనను మరోసారి గుర్తుచేసుకున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య
  • ఫోన్ తన భర్తకు చేయబోయి తనకు చేశారేమోనన్న సుధామూర్తి
  • పేపర్‌లో ప్రచురితమైన సుధామూర్తి కాలమ్‌ను చదివి అభినందించిన అబ్దుల్ కలాం

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి మరోసారి ఆసక్తికరమైన పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ఒకసారి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, తాను రాసిన కాలమ్స్ చదివి ఆస్వాదించానంటూ ఆయన చెప్పారని సుధామూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంగళవారం ఆమె ఒక ఆడియో క్లిప్‌ను షేర్ చేశారు. అబ్దుల్‌ కలామ్‌ నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో ఓ సందర్భంలో చెప్పిన ఆడియో క్లిప్‌ను ఆమె పంచుకున్నారు.

రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ కాల్ వస్తే ‘రాంగ్ కాల్’ అని (ఆపరేటర్‌కి) తాను సమాధానం ఇచ్చానని సుధామూర్తి వెల్లడించారు. తన భర్త నారాయణ మూర్తికి చేయబోయి తనకు చేశారేమో అనుకున్నానని, అందుకే రాంగ్ కాల్ అని చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే ‘అబ్దుల్ కలాం ప్రత్యేకంగా మీ పేరే చెప్పారు’ అనడంతో తాను ఆందోళనతో పాటు ఆశ్చర్యపోయానని, ఏం చేశానని కాల్ చేస్తున్నారో అర్థం కాలేదని గుర్తుచేసుకున్నారు.

అయితే 'ఐటీ డివైడ్' పేరిట తాను రాసిన కాలమ్‌ని చదివి ప్రశంసించడానికి అబ్దుల్ కలాం ఫోన్ చేశారని, చాలా బావుందంటూ తనను మెచ్చుకున్నారని సుధామూర్తి ప్రస్తావించారు. 

కాగా సుధామూర్తి పలు పుస్తకాలు రాశారు. ఎక్కువగా పిల్లలకు సంబంధించిన పుస్తకాలు రాస్తుంటారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఆమె సాహిత్యానికి పలు అవార్డులు కూడా దక్కాయి. సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, పద్మశ్రీ (2006), పద్మ భూషణ్ (2023) అవార్డులను ఆమె స్వీకరించారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. 2006లో అబ్దుల్ కలాం చేతుల మీదుగానే ఆమె ‘పద్మశ్రీ’ అవార్డును స్వీకరించారు.

  • Loading...

More Telugu News