TDP: రేపు లోక్ సభ స్పీకర్ ఎన్నిక... టీడీపీ ఎంపీలకు విప్ జారీ

TDP issues whip ahead of Lok Sabha speaker election
  • జూన్ 26న లోక్ సభ స్పీకర్ ఎన్నిక
  • లోక్ సభలో ఓటింగ్ జరిగే అవకాశం
  • టీడీపీ ఎంపీలు లోక్ సభకు తప్పనిసరిగా హాజరుకావాలన్న చీఫ్ విప్ హరీశ్ బాలయోగి

లోక్ సభలో రేపు (జూన్ 26) స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉండడంతో, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సభ్యులందరూ రేపు లోక్ సభకు తప్పనిసరిగా హాజరై మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో, తన 16 మంది ఎంపీలకు టీడీపీ త్రీ లైన్ విప్ జారీ చేసింది. టీడీపీ ఎంపీలందరూ రేపు లోక్ సభకు తప్పనిసరిగా హాజరుకావాలని టీడీపీ చీఫ్ విప్ జీఎం హరీశ్ బాలయోగి విప్ లో స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు లోక్ సభలో ఉండడంతో పాటు, ఎన్డీయే స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని విప్ జారీ చేశారు. 

లోక్ సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో, రేపు ఉదయం 9.30 గంటలకు ఢిల్లీలో టీడీపీ లోక్ సభా పక్ష నాయకుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షతన టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. స్పీకర్ ఎన్నికలో ఓటింగ్ విధానంపై ఎంపీలకు ఈ సమావేశంలో అవగాహన కల్పించనున్నారు. భేటీ అనంతరం టీడీపీ ఎంపీలంతా పార్లమెంటుకు తరలి వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News