Pocharam Srinivas: పోచారం లాంటి వారు పార్టీ మారితే వచ్చే నష్టమేమీ లేదు... వాటిని పట్టించుకోవద్దు: కేసీఆర్

KCR did not take serious on pocharam joining congress

  • వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని వ్యాఖ్య
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న కేసీఆర్
  • ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శ

పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్‌కు వచ్చిన నష్టమేమీ లేదని... అలాంటి వాటిని పట్టించుకోవద్దని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. మంగళవారం ఆయన ఫామ్ హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదన్నారు.

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో తరుచూ సమావేశమవుతానన్నారు. 

ఈ భేటీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఇతర సీనియర్ నేతలు భేటీ అయ్యారు. వారితో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఎవరూ తొందరపడొద్దని సూచించారు.

  • Loading...

More Telugu News