Asaduddin Owaisi: లోక్ సభలో జై పాలస్తీనా అంటే తప్పేమిటి?: అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi says nothing wrong with Palestine slogan
  • అభ్యంతరం చెప్పేవాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
  • పాలస్తీనా గురించి మహాత్మా గాంధీ ఏం చెప్పారో చదవాలని సూచన
  • అసదుద్దీన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామన్న స్పీకర్

లోక్ సభలో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత చివరలో జై పాలస్తీనా అనడంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆయన ప్రమాణం చేశాక పార్లమెంట్ వెలుపల మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. జై పాలస్తీనా అనడం తప్పు కాదా? అని ప్రశ్నించారు.

అసదుద్దీన్ స్పందిస్తూ... తాను చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. జై పాలస్తీనా అంటే ఇబ్బంది ఏమిటని నిలదీశారు. అభ్యంతరం చెప్పేవాళ్ల గురించి తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మహాత్మా గాంధీ కూడా పాలస్తీనా గురించి ఏం చెప్పారో చదివి తెలుసుకోవాలని సూచించారు. నేను చెప్పాల్సింది చెప్పానని వ్యాఖ్యానించారు.

అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ వెల్లడించారు. ప్రమాణం చేసిన తర్వాత చివరలో,  జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని అసదుద్దీన్ నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News