Sajjala Ramakrishna Reddy: సజ్జలపై సీఐడీకి ఫిర్యాదు చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని

Mines owner complains against Sajjala to CID
  • సజ్జల కనుసన్నల్లో ఆయన అనుచరులు తమ గనులను దోచేశారన్న బద్రీనాథ్
  • వేల కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణ
  • ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారని వెల్లడి 

ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులపై నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్ సీఐడీని ఆశ్రయించారు. సజ్జల కనుసన్నల్లో ఆయన అనుచరులు శ్రీకాంత్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి గనులు దోచేశారని... అదూరు శ్రీచరణ్, కృష్ణయ్యలను అడ్డంపెట్టుకుని అక్రమాలకు తెరలేపారని బద్రీనాథ్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. 

నెల్లూరు జిల్లా సైదాపురం మండలం జోగుపల్లిలో తమకు 240 ఎకరాల భూమి ఉండగా, అందులో 8 గనులు ఉన్నాయని బద్రీనాథ్ వెల్లడించారు. 

అయితే, గత రెండేళ్లుగా తమ గనుల నుంచి అక్రమంగా 800 కోట్ల టన్నుల వరకు క్వార్జ్ ఖనిజాన్ని దోచేశారని, దాని విలువ వేల కోట్లు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి దోచుకున్నారని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారని బద్రీనాథ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News