KCR: జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్

KCR writ petition on Justice Narsimhar Reddy commission
  • కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్న కేసీఆర్
  • బీఆర్ఎస్ హయాంలో నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని వెల్లడి
  • విద్యుత్ కమిషన్, ఎనర్జీ విభాగాన్ని ప్రతివాదులుగా చేర్చిన కేసీఆర్

తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని తెలిపారు. జస్టిస్ నర్సింహారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఏకపక్షంగా వ్యవహరించారని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌లో విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డిని కేసీఆర్ ప్రతివాదులుగా చేర్చారు. ఎనర్జీ విభాగాన్ని కూడా ప్రతివాదిగా చేర్చారు.

  • Loading...

More Telugu News