Chandrababu: మళ్లీ సీఎం అయ్యాక తొలిసారిగా కుప్పం వచ్చిన చంద్రబాబు

CM Chandrababu arrives Kuppam

  • ఏపీలో కూటమి చారిత్రాత్మక విజయం
  • నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు
  • కుప్పంలో చంద్రబాబుకు అడుగడుగునా నీరాజనాలు
  • అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన చంద్రబాబు

చారిత్రాత్మక రీతిలో ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించి అధికారంలోకి రావడం తెలిసిందే. ఇటీవలే చంద్రబాబు నాలుగో పర్యాయం ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు అందుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు మొదటిసారిగా తన సొంత నియోజకవర్గం కుప్పం వచ్చారు. 

హెలికాప్టర్ లో వచ్చిన చంద్రబాబును చూసేందుకు కుప్పం ప్రజలు పోటెత్తారు. అడుగడుగునా తమ నేతకు నీరాజనాలు పలికారు. చంద్రబాబు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖంలో విజయం తాలూకు ఆనందం స్పష్టంగా కనిపించింది. కుప్పంలో తన విజయంలో కీలకపాత్ర పోషించిన కార్యకర్తలను చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఉన్నారు.

చంద్రబాబు నేడు, రేపు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మండలాల వారీగా నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తొలుత హంద్రీనీవా పనులను పరిశీలించనున్నారు.

Chandrababu
Kuppam
Chief Minister
TDP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News