KCR: హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఊరట

Relief to KCR in Rail Rokho case
  • 2011 నాటి రైల్ రోకో కేసులో కేసీఆర్‌పై విచారణకు హైకోర్టు స్టే  
  • ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
  • తదుపరి విచారణ వచ్చే నెల 18కి వాయిదా

తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంగళవారం ఊరట దక్కింది. 2011 నాటి రైల్ రోకో కేసులో కేసీఆర్‌పై విచారణకు హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది. తాను నాటి రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొనలేదని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై అక్రమ కేసు పెట్టారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసీఆర్‌కు తాత్కాలిక ఊరటను ఇచ్చింది.

  • Loading...

More Telugu News