Wine shops: మద్యం షాపుల క్లోజింగ్ టైమింగ్స్‌ ప్రచారంపై హైదరాబాద్ పోలీసుల స్పందన

The news that the Wine shops are closing at 11 am is completely misleading says Hyderabad City Police

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దృష్ట్యా ఇకపై రాష్ట్రంలోని వైన్ షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి గం. 10.30 -11.00 కల్లా కట్టేయాలంటూ సోమవారం గుప్పుమన్న కథనాలు తప్పు అని తేలిపోయింది. ఈ ప్రచారంపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేయాలంటూ వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి అని సోషల్ మీడియా వేదికగా సిటీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఎక్స్ వేదికగా స్పందించారు. 

ప్రస్తుత నిబంధనల ప్రకారమే దుకాణాలు, సంస్థలు ఎప్పటిమాదిరిగానే తెరచుకుని, మూసుకుంటాయని, సమయాల విషయంలో ఎలాంటి మార్పు లేదని వివరించారు. కాగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు ఆదేశాలు జారీ చేశారంటూ సోమవారం ప్రచారం జరిగింది. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయని, నేరాల తీవ్రత పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇదంతా అసత్యమేనని పోలీసుల క్లారిటీతో తేలిపోయింది.

  • Loading...

More Telugu News