Sridhar Babu: బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక ఇష్యూ... జీవన్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగింపు

Sridhar Babu trying to convince Jeevan Reddy
  • జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి మంత్రి
  • కేసీఆర్ వంటి నేతలు ఆహ్వానించినా తాను వెళ్లలేదన్న జీవన్ రెడ్డి
  • గౌరవానికి తగిన పదవి ఇస్తామని శ్రీధర్ బాబు బుజ్జగింపు
  • శ్రీధర్ బాబుకు నిరసన సెగ

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరిక నేపథ్యంలో... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని యోచిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగిస్తున్నారు. జగిత్యాలలోని సీనియర్ నేత నివాసానికి మంత్రి వెళ్లారు. అంతకుముందు, పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు ఆయనతో చర్చ జరిపారు. ఆ తర్వాత శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. బుజ్జగింపుల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, జీవన్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు.

తాను పార్టీ కోసం 40 ఏళ్లుగా చిత్తశుద్ధితో పని చేశానని ఆయన శ్రీధర్ బాబుతో వాపోయారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ వంటి నేతలు ఆహ్వానించినప్పటికీ తాను పార్టీని వీడలేదని తెలిపారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి విషంలో అన్యాయం జరిగిందని... ఇప్పుడూ అన్యాయమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. కనీసం ఎమ్మెల్యే చేరిక గురించి కూడా తనకు సమాచారం లేదని వాపోయారని సమాచారం. తనకు సరైన గౌరవం ఇవ్వలేదన్నారు. అయితే మీ గౌరవానికి తగిన పదవి ఇస్తామని జీవన్ రెడ్డికి శ్రీధర్ బాబు నచ్చచెప్పారని తెలుస్తోంది.

శ్రీధర్ బాబుకు నిరసన సెగ

జీవన్ రెడ్డి నివాసంలో మంత్రి శ్రీధర్ బాబుకు ఆయన అనుచరుల నుంచి నిరసన సెగ తగిలింది. కార్యకర్తలు జీవన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. జీవన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి శ్రీధర్ బాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు.

  • Loading...

More Telugu News