Atishi: ఢిల్లీకి నీటి కోసం నిరాహార దీక్ష... క్షీణిస్తున్న అతిశీ ఆరోగ్యం

Atishi says her ketone levels elevated
  • హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని డిమాండ్
  • నాలుగో రోజుకు చేరుకున్న అతిశీ నిరాహార దీక్ష
  • తన రక్తపోటు, చక్కెరస్థాయులు పడిపోయాయన్న అతిశీ
తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీకి హర్యానా ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ మంత్రి అతిశీ నిరాహార దీక్షను చేపట్టారు. ఆమె దీక్ష ఈ రోజు నాలుగో రోజుకు చేరుకుంది. సోమవారం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారు.

ఈ సందర్భంగా అతిశీ మాట్లాడుతూ... తన రక్తపోటు, చక్కెరస్థాయులు పడిపోతున్నాయన్నారు. బరువు కూడా తగ్గినట్లు చెప్పారు. భవిష్యత్తులో తన ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాను ఢిల్లీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. హర్యానా నీటిని విడుదల చేసేవరకు నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు.
Atishi
AAP
New Delhi
Haryana

More Telugu News