TG Inter Supplimentary Results 2024: తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల విడుద‌ల‌

Telangana Inter Supplimentary Results 2024 Released
  • సెకండియర్ సప్లిమెంటరీలో 43.77 శాతం ఉత్తీర్ణత 
  • ఫస్టియర్ సప్లిమెంటరీలో 63.86 శాతం ఉత్తీర్ణత 
  • తెలంగాణలో మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు
  • సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తంగా 4.5 లక్షల మంది విద్యార్థుల హాజ‌రు

తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ మొద‌టి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. సెకండియర్ సప్లిమెంటరీలో 43.77 శాతం ఉత్తీర్ణత న‌మోదు కాగా, ఫస్టియర్ సప్లిమెంటరీలో 63.86 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. 

ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌  https://results.cgg.gov.in/ తో పాటు ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, ఇత‌ర‌ వివరాలు నమోదుచేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. 

ఇక రాష్ట్రంలో మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తంగా 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News