Nara Brahmani: లోకేశ్‌పై నారా బ్రాహ్మణి ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

Nara Brahmani Interesting Tweet on Nara Lokesh


ఏపీ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అర్ధాంగి నారా బ్రాహ్మణి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. "అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఈడీ వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశావ్. పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు. నీ వ్యక్తిత్వహననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్ల‌కు నువ్వేంటో తెలియజేశావు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకొన్నావు. నీ సమర్ధతతో నేటితరం, భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది. కుటుంబపరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్ నారా లోకేశ్" అంటూ ఆమె ట్వీట్ చేశారు.

Nara Brahmani
Nara Lokesh
Twitter
TDP
Andhra Pradesh

More Telugu News