Right To Education: విద్యాహక్కు చట్టంలో 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలంటూ జగన్ ప్రభుత్వం జీవోలకు హైకోర్టు బ్రేక్

AP High Court Breaks Jagan Govt GOs On 25 Percent Free Seats In Private Schools

  • ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలంటూ గత ప్రభుత్వం జీవోలు
  • హైకోర్టును ఆశ్రయించిన తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్, ఇస్మా
  • తుదితీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు
  • విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవాలని సూచన

విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలంటూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు గాను ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలన్న గత ప్రభుత్వ జీవోలపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తొందరపాటు చర్యగా అభివర్ణించింది. 

తూర్పుగోదావరి జిల్లా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్, ఇస్మా సంయుక్తంగా వేసిన పిటిషన్లపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రాష్ట్ర విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించింది. పిటిషనర్ తరపున మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు.

  • Loading...

More Telugu News