NEET UG-2024: దేశవ్యాప్తంగా ముగిసిన 'నీట్' రీ ఎగ్జామ్

NEET re exam concluded all over country

  • వివాదాస్పదంగా మారిన నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష
  • ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంకు
  • సమయం కోల్పోయిన వారికి గ్రేస్ మార్కులు కలిపామన్న ఎన్టీయే
  • వారందరికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు

ఇటీవల నీట్ యూజీ-2024 ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించగా, ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకు రావడం సందేహాలకు తావిచ్చింది. దాంతో పలువురు న్యాయపోరాటం చేయగా, పరీక్ష సందర్భంగా కొందరు అభ్యర్థులు వివిధ కారణాల వల్ల సమయం కోల్పోయారని, వారికి గ్రేస్ మార్కులు కలిపామని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే) వెల్లడించింది. 

అయితే, ఆ గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎన్టీయేని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నేడు నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించారు. అయితే, 813 మంది మాత్రమే ఇవాళ్టి పరీక్షకు హాజరయ్యారు. 750 మంది గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఎన్టీయే అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News