Results: తెలంగాణలో రేపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

Telangana Inter advanced supplementary results will release tomorrow
  • తెలంగాణలో మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు
  • జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి
  • జూన్ 24 మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాల విడుదల

తెలంగాణలో మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన వారు, ఇంప్రూవ్ మెంట్ కోసం ప్రయత్నించేవారు ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఆన్సర్ పేపర్ల మూల్యాంకనం ఇటీవలే పూర్తయింది. ఈ నేపథ్యంలో, ఫలితాల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రేపు (జూన్ 24) మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News