Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్

Kejriwal challenges Delhi High Court Stay orders in Supreme Court

  • ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్
  • ఇటీవల బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు
  • కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఈడీ
  • బెయిల్ పై స్టే ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు 

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయగా, ఆ బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. 

తాజాగా, ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సీఎం కేజ్రీవాల్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను అత్యవసర ప్రాతిపదికన రేపు (సోమవారం) విచారణ జరపాలని కేజ్రీవాల్ న్యాయవాదులు సుప్రీంకోర్టు రిజిస్ట్రీని కోరనున్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ అభియోగాలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  (ఈడీ) అధికారులు మార్చి 21న అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన... ఎన్నికలు ముగిశాక మళ్లీ జైలుకు వెళ్లారు. 

ఇటీవల ఢిల్లీల్లోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు రూ.1 లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేయడంతో, కేజ్రీవాల్ జైలు నుంచి బయటికి వస్తారని అందరూ భావించారు. అయితే, ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా... కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంతో ఆయన విడుదలకు అవాంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే, కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News