Heavy Rain: హైదరాబాదులో చాలా ప్రాంతాలను ముంచెత్తిన భారీ వర్షం

Heavy rain lashes many parts of Hyderabad
  • ఈ సాయంత్రం భారీ వర్షంతో తడిసిముద్దయిన నగరం
  • లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరిన వైనం
  • రోడ్లు జలమయం

హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. మియాపూర్, కొండాపూర్, చందానగర్, గచ్చిబౌలి, సరూర్ నగర్, లింగంపల్లి, మలక్ పేట్, మాదాపూర్, చాదర్ ఘాట్, సైదాబాద్, చంపాపేట్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బోరబండ, ఎస్సార్ నగర్, యూసఫ్ గూడా, అమీర్ పేట్, పంజాగుట్ట ప్రాంతాలు వర్షంతో తడిసిముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడింది. కాగా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

  • Loading...

More Telugu News