Kishan Reddy: తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union minister Kishan Reddy consoles Talasani Srinivas Yadav
  • ఈ నెల 10న తలసాని సోదరుడు శంకర్ యాదవ్ మృతి
  • నేడు శంకర్ యాదవ్ నివాసానికి వచ్చిన కిషన్ రెడ్డి
  • శంకర్ యాదవ్ చిత్రపటానికి నివాళులు

ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేడు సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని శంకర్ యాదవ్ నివాసానికి వచ్చారు. అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి పరామర్శించారు. తలసాని మాతృమూర్తి లలితాబాయిని, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తన సానుభూతి తెలిపారు. అంతకుముందు, శంకర్ యాదవ్ చిత్రపటానికి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు.

  • Loading...

More Telugu News