Elon Musk: ఎలాన్ మస్క్ కు పదకొండో బిడ్డ

Elon Musk and Neuralink Shivon Zilis secretly welcome third kid in quiet affair

  • న్యూరాలింక్ ఉద్యోగినితో మూడో బిడ్డను కన్న మస్క్
  • మొత్తంగా మస్క్ కు పదకొండు మంది సంతానం
  • మొదటి భార్యతో ఐదుగురు, గర్ల్ ఫ్రెండ్స్ తో ఆరుగురు పిల్లలు

స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు.. ఆయన గర్ల్ ఫ్రెండ్, న్యూరాలింక్ ప్రాజెక్ట్ హెడ్ షివాన్ జెలీస్ కు మూడో బిడ్డ పుట్టాడు. దీంతో ఎలాన్ మస్క్ సంతానం సంఖ్య పదకొండుకు చేరింది. మొదటి భార్య జస్టిన్ మస్క్ తో ఎలాన్ మస్క్ ఐదుగురు పిల్లలకు తండ్రయ్యారు. ఆపై భార్యతో విడిపోయిన మస్క్.. మ్యూజిషియన్ గ్రిమెస్ తో డేటింగ్ చేశారు. ఆమెతో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు.

2021 లో తన కంపెనీ చేపట్టిన స్పెషల్ ప్రాజెక్ట్ న్యూరాలింక్ కు హెడ్ గా వ్యవహరిస్తున్న షివాన్ జెలీస్ తో మస్క్ సహజీవనం చేశారు. అదే ఏడాది జెలీస్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. అప్పట్లో మస్క్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది పిల్లలు లేకుంటే నాగరికత కుంగిపోతుందని, అందుకే తాను పది మంది పిల్లలకు తండ్రయ్యానని చెప్పారు. తాజాగా మరో బిడ్డకు జెలీస్ జన్మనివ్వడంతో మస్క్ సంతానం పదకొండుకు చేరింది. 

తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగినులతో సన్నిహిత సంబంధం పెట్టుకోవడం మస్క్ కు సాధారణంగా మారింది. 2013 లో స్పేస్ ఎక్స్ కంపెనీలో ఉద్యోగం మానేసిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనకు పిల్లలను కనివ్వాలంటూ మస్క్ ప్రతిపాదించాడని ఆరోపించింది. తన సంస్థలలో పనిచేసే మరో ఇద్దరు ఉద్యోగినులతో మస్క్ కు వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి. ఇక న్యూరాలింక్ ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలు చూస్తున్న జెలీస్ కూ మస్క్ నుంచి ఇదే తరహా ప్రతిపాదన ఎదురైందట. దానికి ఓకే చెప్పిన జెలీస్.. 2021లో కవల పిల్లలకు, తాజాగా మరో మగ బిడ్డకు జన్మనిచ్చింది.

More Telugu News