Sperm Count: వీర్యకణాలను పెంచే ఆహార పదార్థాలు ఇవే!

What to eat to increase male sperm count

  • ఆకు కూరలు, పండ్లు క్రమం తప్పకుండా తీసుకోవాలంటున్న నిపుణులు
  • వాల్ నట్స్, బాదం పప్పులనూ అశ్రద్ధ చేయొద్దని సూచన
  • మాంసాహారులకు సీ ఫుడ్స్ బెస్ట్ ఛాయిస్ అంటున్న ఆరోగ్య నిపుణులు

వాల్ నట్స్ లో పుష్కలంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫోలేట్ వీర్యకణాల వృద్ధికి తోడ్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. బాదం పప్పులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు జింక్, సెలీనియం, విటమిన్-ఇ తదితర పోషకాలు ఉంటాయని చెప్పారు. రోజువారీ ఆహారంలో బాదం పప్పులకు చోటిస్తే స్పెర్మ్ కౌంట్ దెబ్బతినకుండా కాపాడతాయని తెలిపారు. బ్రెజిల్ నట్స్ తో వీర్య కణాల వృద్ధితో పాటు ఆరోగ్యం చేకూరుతుందని వివరించారు. ఇందులోని సెలీనియం స్పెర్మ్ నాణ్యతను పెంచుతుందన్నారు.

వంటింట్లో తప్పకుండా కనిపించే టమాటాలతోనూ వీర్య కణాల నాణ్యత పెంచుకోవచ్చని చెప్పారు. వీటిలో లైకోపీన్ ఉంటుందన్నారు. రోజూ రెండు, మూడు టేబుల్ స్పూన్ల టమాటా గుజ్జును తీసుకుంటే స్పెర్మ్ నాణ్యత పెరుగుతుందని వివరించారు. మాంసాహారులైతే సీ ఫుడ్స్ తరచుగా తీసుకోవడం ద్వారా వీర్య పుష్టిని పెంచుకోవచ్చని చెప్పారు. సముద్రపు చేపలు, రొయ్యలు వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు ఇతరత్రా పోషక పదార్థాలు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయన్నారు.

ఆకు కూరలు, ఆకు పచ్చని కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ సెల్యూలార్ దెబ్బతినకుండా కాపాడతాయని, వీర్య కణాల కదలికలను చురుగ్గా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మడి గింజలలో ఉండే ఫైటోస్టెరాల్ కు టెస్టోస్టెరాన్ స్థాయులను పెంచే గుణముందని చెప్పారు. పురుషులలో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల స్పెర్మ్ నాణ్యత పెరుగుతుందని తెలిపారు. స్పెర్మ్ కదలికలను మెరుగ్గా ఉంచేందుకు విటమిన్ సి తోడ్పడుతుందని చెబుతూ.. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు.

More Telugu News