Ghattamaneni Adi seshagiri Rao: వైసీపీని అందుకే వీడాల్సి వచ్చింది: ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

Ghattamaneni Adi Seshagiri Rao About Jagans tadepalli House

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, నిర్మాత, రాజకీయనాయకుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ ప్రస్తానం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన తరువాత కాంగ్రెస్ 90 శాతం ఓటు బ్యాంకు, నాయకులు వైసీపీ వైపు మళ్లారని, ఆ క్రమంలో తన అడుగులు వైసీపీ వైపు పడ్డాయని చెప్పారు. జగన్‌తో పార్టీ వ్యవహారాలకు సంబంధించి చిన్న భేదాభిప్రాయం కారణంగా తాను 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడాల్సి వచ్చిందన్నారు. 

జగన్ పార్టీ నడిపే విధానంతో విభేదించి టీడీపీలో చేరానని చెప్పారు. కానీ, వైసీపీలో ఉండగా పాదయాత్ర నుంచి పార్టీ నిర్మాణం వరకూ పలు అంశాల్లో క్రియాశీలకంగా ఉండేవాణ్ణని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీ నిర్వహణలో డిక్టెటోరియల్ ఆటిట్యూడ్ ఉండకూడదని అన్నారు. జగన్ తన ఐదేళ్ల పాలనతో కేడర్‌ను పట్టించుకోలేదని అన్నాడు. కేడర్‌ను పట్టించుకోకపోవడం ఏ పార్టీకీ మంచిది కాదని అన్నారు. 

జగన్‌కు చెందిన తాడేపల్లి పార్టీ క్యాంపు ఆఫీసు, నివాసం నిర్మాణం తన కుమారుడి ఆధ్వర్యంలోనే జరిగిందని అన్నారు. తొలుత అది విల్లాల కోసం స్టార్ట్ చేసిన ప్రాజెక్టు అయినప్పటికీ పార్టీ ఆఫీసు ఉంటే బాగుంటుందని తానే చెప్పినట్టు ఆదిశేషగిరిరావు అన్నారు. అయితే, ప్లాట్ల కేటాయింపు, నిర్మాణ సమయంలో జగన్ అక్కడకు రాలేదని, గృహప్రవేశానికి మాత్రమే వచ్చాడని తెలిపారు. జగన్ పేరు మీద సైటు కొని నిర్మాణ పనులు చేపట్టామని, ఇందుకు సంబంధించిన కాంట్రాక్ట్ తమకు ఇచ్చారని అన్నారు.

  • Loading...

More Telugu News