Seethakka: ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాం: మంత్రి సీతక్క

Seethakka promises on employement
  • ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్న సీతక్క
  • గంజాయిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడతామన్న మంత్రి
  • అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన
  • విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక

వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. గంజాయిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడతామన్నారు. ఎక్కడైనా భూకబ్జాదారులు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని... బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News