T20 World Cup 2024: బంగ్లాదేశ్ తో సూపర్-8 మ్యాచ్... టీమిండియాకు బ్యాటింగ్

Bangladesh won the toss and put Team India into batting

  • టీ20 వరల్డ్ కప్ లో ప్రస్తుతం సూపర్-8 దశ
  • గ్రూప్-1లో భాగంగా నేడు టీమిండియా × బంగ్లాదేశ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

టీ20 వరల్డ్ కప్ లో నేడు టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య సూపర్-8 గ్రూప్-1 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతోంది. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లీ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు చేయలేదు. సూపర్-8 తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై గెలిచిన జట్టునే బరిలో దింపుతున్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. కాగా, బంగ్లాదేశ్ తన తొలి సూపర్-8 మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఓడిపోయింది.

  • Loading...

More Telugu News