Errabelli: ఓడిపోయామనే బాధలో ఉన్నాం కానీ...: పార్టీ మార్పుపై స్పందించిన ఎర్రబెల్లి

Errabelli responds on Party change
  • పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి
  • అసెంబ్లీ, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయామనే బాధ ఉందన్న ఎర్రబెల్లి
  • కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన

తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు స్పందించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తాను పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరుగుతోందని... అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడిందనే బాధ ఉందని... కానీ పార్టీ మారే ఆలోచన లేదన్నారు. కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

తాను తన నియోజకవర్గంలో ఓటమిపై సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలనేదే తన ధ్యేయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో... ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయామనే బాధతో ఉన్నామన్నారు. జీవితంలో ఇక పార్టీ మారే ఆలోచన తనకు లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News