Bihar: బీహార్‌లో కుప్పకూలిన మరో వంతెన... బ్రిడ్జి కూలుతున్న వీడియో ఇదిగో

Bridge Collapsed in Bihar

  • కూలిన గండక్ కాలువ పైవంతెన
  • ఈ వారంలో బీహార్‌లో రెండో ఘటన
  • ఇటీవల కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

బీహార్‌లో మరో వంతెన కుప్పకూలింది. ఈ వారంలో ఇది రెండో ఘటన. ఇటీవల నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలింది. ఇప్పుడు బీహార్‌లోని సివాన్ జిల్లాలో గల గండక్ కాలువపై ఉన్న వంతెన కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. మహారాజ్‌గంజ్ జిల్లాలోని పటేధి బజార్ మార్కెట్‌ను... దర్భంగాలోని రామ్‌గఢ్ పంచాయతీతో ఈ వంతెన కలుపుతుంది. శనివారం ఉదయం ఈ వంతెన ఒక్కసారిగా భారీ శబ్దంతో కుప్పకూలింది.

ఈ వంతెన పైనుంచి ప్రతిరోజు వందలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. నిర్వహణ లోపం వల్లే వంతెన కూలిపోయిందని... ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వంతెన దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. ఇప్పుడిది కూలిపోవడంతో గండక్ కాలువ మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News