AP Cabinet: ఈ నెల 24న ఏపీ క్యాబినెట్ తొలి సమావేశం

AP Cabinet will meet in JUne 24

  • ఏపీలో కొత్త ప్రభుత్వం
  • నూతన క్యాబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారు
  • ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై మంత్రులకు నిర్దేశించనున్న సీఎం చంద్రబాబు

ఏపీలో కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభించిన నేపథ్యంలో, క్యాబినెట్ తొలిసారిగా సమావేశం కానుంది. ఈ నెల 24న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నారు. హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు ఈ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News