KTR: రేవంత్ రెడ్డి అబద్దాలు చూసి గోబెల్స్ తన సమాధిలో ఉలిక్కిపడ్డారు: కేటీఆర్ ఎద్దేవా

KTR fires at Revanth Reddy
  • తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని విమర్శ
  • బొగ్గు బ్లాకుల అమ్మకాలను బీఆర్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకించిందన్న కేటీఆర్
  • కానీ బొగ్గు గనుల వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాల్గొందని విమర్శ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు చూసి గోబెల్స్ తన సమాధిలోనే ఉలిక్కిపడ్డారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల అమ్మకాలను బీఆర్ఎస్ వ్యతిరేకించిందన్నారు. బొగ్గు గనుల వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాల్గొందని గుర్తు చేశారు. కానీ తాము మాత్రం ఎప్పుడూ పాల్గొనలేదన్నారు. చివరి రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం రెండు బ్లాక్‌లను ఏకపక్షంగా వేలం వేసిందని ఆరోపించారు.

తెలంగాణ ఆస్తులు, హక్కులు, వనరులు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆస్తులు తాకట్టు పెట్టే నేరాల్లో కాంగ్రెస్, బీజేపీ భాగస్వాములని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నదీ ప్రాంత హక్కుల రక్షణలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో బీజేపీకి కాంగ్రెస్ సహకారం అందించిందని ఆరోపించారు. అన్ని రంగాలకు ద్రోహం చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

  • Loading...

More Telugu News