Ayyanna Patrudu: నేను తక్కువ మాట్లాడతా... మీకు ఎక్కువ అవకాశం ఇస్తా: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Speaker Ayyanna Patrudu speech in Assembly

  • ఏపీ 16వ శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు
  • సభను ఉద్దేశించి మాట్లాడిన అయ్యన్న
  • సమస్యలను సభలో ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని సూచన
  • 16వ అసెంబ్లీకి గుర్తింపు వచ్చేలా ఎమ్మెల్యేలందరూ సహకరించాలని విజ్ఞప్తి

ఏపీ 16వ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు హుందాతనం అవసరం అని స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైతే శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని అన్నారు. సమస్యలను సభలో ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని సూచించారు. శాసనసభ కార్యకలాపాలను రాష్ట్ర ప్రజలంతా చూస్తారని, 16వ శాసనసభకు గుర్తింపు వచ్చేలా ఎమ్మెల్యేలందరూ సహకరించాలని స్పీకర్ హోదాలో అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు. 

"ప్రజలు మనకు ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. ఈ సభలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మహిళా ఎమ్మెల్యేలు, ఉన్నత విద్యావంతులు, కొత్త మంత్రులు ఉన్నారు. నేను ఈ సభలో తక్కువ మాట్లాడతా, మీకు ఎక్కువ అవకాశం ఇస్తా. ప్రజలకు పనికొచ్చే విధంగా అందరం కలిసి ఈ సభను గౌరవ సభగా నడిపించుకుందాం" అని  అయ్యన్న పేర్కొన్నారు.

ఇక, ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవి. ఈ సమావేశాలు నిన్న (జూన్ 21) ప్రారంభం అయ్యాయి. రెండ్రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక చేపట్టారు.

  • Loading...

More Telugu News