Ambati Rambabu: చంద్ర‌న్న ప్రజాస్వామ్యవాదా..? విధ్వంసకారుడా..?: అంబ‌టి రాంబాబు

Ambati Rambabu Tweets on YSRCP Office Demolition
నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణ ద‌శ‌లో ఉన్న వైసీపీ కేంద్ర‌ కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు శ‌నివారం ఉద‌యం కూల్చివేసిన విష‌యం తెలిసిందే. ఈ నిర్మాణం కూల్చివేత‌పై తాజాగా వైసీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. 

"సూప‌ర్‌ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీసు కూల్చ‌డ‌మే ముఖ్య‌మ‌ని భావించిన చంద్ర‌న్న ప్రజాస్వామ్యవాదా..? విధ్వంసకారుడా..?" అంటూ ట్వీట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, విధ్వంసమేనని ఆయ‌న‌ విమర్శించారు. దీనికి తాడేపల్లిలో నిర్మాణాన్ని బుల్డోజ‌ర్లు కూల్చివేస్తున్న వీడియోను జ‌త చేశారు.  

మ‌రోవైపు టీడీపీ నేతలు మాత్రం ప్రజావేదికతో పోలిక చెబుతున్నారు. అప్పుడు ప్రజావేదిక కూల్చినప్పుడు వైసీపీ నేతలు ఎందుకు చంకలు గుద్దుకున్నారని, ఇప్పుడు వైసీపీ ఆఫీస్ కూల్చి వేస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
Ambati Rambabu
YSRCP Office Demolition
Tadepalli
Andhra Pradesh

More Telugu News