Jofra Archer: డికాక్, మిల్లర్ లను అవుట్ చేసి సఫారీలకు కళ్లెం వేసిన ఆర్చర్

England pacer Jofra Archer halts SA agression

  • నేడు టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ × దక్షిణాఫ్రికా
  • సూపర్-8 మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
  • 3 వికెట్లతో సత్తా చాటిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్

టీ20 వరల్డ్ కప్ లో నేడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. సూపర్-8 దశలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేయగలిగారు. 

ఓ దశలో క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ దూకుడు చూస్తే దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించేలా కనిపించింది. డికాక్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 65 పరుగులు చేయగా... మిల్లర్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు సాధించాడు. అయితే వీరిద్దరినీ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా దూకుడుకు కళ్లెం పడింది.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 19, హెన్రిచ్ క్లాసెన్ 9, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ 1, ట్రిస్టాన్ స్టబ్స్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్  బౌలర్లలో ఆర్చర్ 3, మొయిన్ అలీ 1, అదిల్ రషీద్ 1 వికెట్ తీశారు.

Jofra Archer
England
South Africa
Super-8
T20 World Cup 2024
  • Loading...

More Telugu News