బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో సోదాలు... రూ.300 కోట్ల మైనింగ్ అక్రమాలు గుర్తించామన్న ఈడీ
- పటాన్‌చెరు ఎమ్మెల్యే నివాసంలో జరిగిన సోదాలపై ఈడీ ప్రకటన
- మనీలాండరింగ్, హవాలా నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్లు వెల్లడి
- డబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించిన ఈడీ
మహిపాల్ రెడ్డి సోదరుల నివాసాల్లో సోదాల సమయంలో రూ.19 లక్షల నగదును గుర్తించినట్లు ఈడీ తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను గుర్తించామని తెలిపింది. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించింది. లావాదేవీలన్నీ బినామీ పేర్లతో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరువవలసి ఉందని వెల్లడించింది. వీరికి పలువురు బినామీలుగా ఉన్నట్లు ఈడీ గుర్తించింది.