Liquor: హైదరాబాదులో అక్రమ మద్యం తయారు చేస్తోన్న డిస్టిలరీపై కేసు నమోదు

Case filed against Bagga Distillery GM and MD
  • డిస్టిలరీ జీఎంను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు
  • మరికొంతమంది పరారీలో ఉన్నట్లు వెల్లడి
  • తెలంగాణలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం
హైదరాబాదులో అక్రమ మద్యం తయారు చేస్తోన్న బగ్గా డిస్టిలరీపై కేసు నమోదయింది. బగ్గా డిస్టిలరీ జీఎం, ఎండీ తదితరులపై కేసు నమోదు చేశారు. డిస్టిలరీ జీఎం బీ రమేశ్‌ను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

భారీగా అక్రమ మద్యం స్వాధీనం

తెలంగాణలో ఎక్సైజ్ పోలీసులు భారీగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ లేబుల్స్‌ను ఉపయోగించి మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ అధికారులు డిస్టిలరీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ లేబుల్స్‌తో మద్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే డిస్టిలరీ మేనేజర్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 10 వేల కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Liquor
Telangana
Police

More Telugu News