Team India: దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన ఖరారు... షెడ్యూల్ విడుదల

Team India tour of Soutj Africa schedule released

  • ఈ ఏడాది నవంబరులో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా
  • ఇరు జట్ల మధ్య 4 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • సంయుక్తంగా ప్రకటన విడుదల చేసిన రెండు దేశాల క్రికెట్ బోర్డులు

టీమిండియా క్రికెట్ జట్టు ఈ ఏడాది నవంబరులో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా సఫారీలతో 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ను కేఎఫ్ సీ స్పాన్సర్ చేస్తోంది. కాగా, ఈ సిరీస్ ను ఖరారు చేస్తూ క్రికెట్ సౌత్ ఆఫ్రికా, బీసీసీఐ ఓ ప్రకటన చేశాయి. ఈ మేరకు నేడు రెండు దేశాల బోర్డులు షెడ్యూల్ విడుదల చేశాయి. 

టీ20 సిరీస్ మ్యాచ్ షెడ్యూల్...
మొదటి టీ20-  నవంబరు 8 (డర్బన్)
రెండో టీ20  -  నవంబరు 10 (గెబెర్హా)
మూడో టీ20-   నవంబరు 13 (సెంచురియన్)
నాలుగో టీ20-  నవంబరు 16 (జొహాన్నెస్ బర్గ్)

  • Loading...

More Telugu News