KTR: కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు తెలంగాణ సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచిందని 'ది ఎకనమిస్ట్' పేర్కొంది: కేటీఆర్

KTR tweets about Economist The Telangana Model
  • తెలంగాణ మోడల్ అంటూ ఎకనమిస్ట్ మ్యాగజైన్ కథనాన్ని ట్వీట్ చేసిన కేటీఆర్
  • పదేళ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందన్న కేటీఆర్
  • అభివృద్ధి యజ్ఞాన్ని కాంగ్రెస్ ముందుకు తీసుకుపోవాలని సూచన

మరిన్ని కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ఒక సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచిందంటూ ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ 'ది ఎకనమిస్ట్' రాసిన కథనాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు 'తెలంగాణ మోడల్' అంటూ కథనాన్ని ఇచ్చింది. ఈ కథనాన్ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

కొత్త రాష్ట్రమైన తెలంగాణ పదేళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, తద్వారా మరిన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేందుకు ఒక సక్సెస్‌ఫుల్‌ మోడల్‌గా నిలిచిందని పేర్కొందని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికైనా పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై బురద జల్లడం మానుకొని, అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకుపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఒక అభివృద్ధి మోడల్‌గా నిలిచిందన్నారు. కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని పత్రిక పేర్కొందన్నారు.

మ్యాగజైన్‌లో పేర్కొన్న అంశాలు... 

'తెలంగాణ ఏర్పడిన నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7.8 గిగావాట్లు కాగా పదేళ్లలో 19.3 గిగావాట్లకు పెరిగింది.
ఐటీ ఎగుమతులు 2014 నుంచి 2023 వరకు 9 ఏళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. తెలంగాణ ఐటీ దిగుమతులు ప్రస్తుతం 29 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఐటీ ఉద్యోగాలు దాదాపు మూడు రెట్లు పెరిగి 9, 00,000కి చేరుకున్నాయి.
రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలలోపు దేశ జీడీపీ 4.1 శాతం నుంచి 4.9 శాతానికి తెలంగాణ కంట్రిబ్యూషన్ పెరిగింది' అని పేర్కొన్నారు.

ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లు సైతం తెలంగాణ పదేళ్ల ప్రగతి ప్రస్తానాన్ని గొప్పగా కొనియాడుతున్న నేపథ్యంలో, ఇకనైనా కాంగ్రెస్ పాలకులు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు నిలిపివేస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ సాధించిన‌ అభివృద్ధిని ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు..

  • Loading...

More Telugu News