Rajesh Kumar: మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ' రౌతు కా రాజ్'

Raothu Ka Raj Update

  • నవాజుద్దీన్ సిద్ధిఖీ నుంచి ' రౌతు కా రాజ్'
  • మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో నవాజుద్దీన్  
  • ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్


బాలీవుడ్ లో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా నవాజుద్దీన్ సిద్ధికీ కనిపిస్తాడు. ఆయనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది ..  యాక్టింగ్ స్టైల్ ఉంది. అలాంటి ఆయన నుంచి ఒక సినిమా రానుంది .. ఆ సినిమా పేరే 'రౌతు కా రాజ్'. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి, ఆనంద్ సురపూర్ దర్శకత్వం వహించాడు. 

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5వారు దక్కించుకున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. ఈ సినిమాలో నవాజుద్దీన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. 

ఒక బ్లైండ్ స్కూల్ కి సంబంధించిన వాచ్ మెన్ అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. ఆ మర్డర్ మిస్టరీ ఎవరికీ కూడా అంతుబట్టదు. దాంతో ఈ కేసు విషయాన్ని తేల్చడానికి పోలీస్ ఆఫీసర్ దీపక్ వేగి రంగంలోకి దిగుతాడు. అప్పుడు అతనికి ఆ మర్డర్ గురించి ఎలాంటి చేదు నిజాలు తెలుస్తాయి? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అనేది మిగతా కథ. 

Rajesh Kumar
Athul Twivari
Narayana Shastri
  • Loading...

More Telugu News