AdiNarayana Reddy: బీజేపీలోకి వైసీపీ సీనియర్ మిథున్ రెడ్డి!.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
![MLA AdiNarayana Reddy says that YCP Mithun Reddy trying to join BJP](https://imgd.ap7am.com/thumbnail/cr-20240621tn667550e66d9df.jpg)
జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ మేరకు మిథున్ రెడ్డి లాబీయింగ్ నడుపుతున్నారని, బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఇంకా లాబీయింగ్ నడుపుతూనే ఉన్నారని పేర్కొన్నారు.
మిథున్ రెడ్డి బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్‌లోకి వెళ్లారని, తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా మిథున్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాశ్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే బీజేపీ నాయకత్వం అక్కర్లేదని చెబుతోందని ఆదినారాయణరెడ్డి చెప్పారు. వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. అసెంబ్లీ లాబీ చిట్‌చాట్ లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.