IMD: తెలంగాణలో మూడురోజుల పాటు భారీ వర్షాలు

IMD predicts three day rain in telangana
  • ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి
  • శనివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
  • గంటకు 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరిక

తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

ఆదిలాబాద్, కొమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాయని దీంతో స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు. కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయన్నారు. అల్లూరి జిల్లా, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.

  • Loading...

More Telugu News