Mallu Bhatti Vikramarka: సింగరేణికి కొత్త గనులు కేటాయించాలి: మల్లు భట్టివిక్రమార్క

Bhattivikramarka on coal mines
  • సింగరేణి తెలంగాణ కొంగు బంగారమన్న భట్టివిక్రమార్క
  • సింగరేణి బొగ్గుతోనే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నడుస్తున్నాయని వెల్లడి
  • ఎన్ఎండీఆర్ సవరణ తర్వాత సింగరేణి తన హక్కులను కోల్పోయిందన్న ఉపముఖ్యమంత్రి

సింగరేణికి కొత్త గనులను కేటాయించాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సింగరేణి తెలంగాణ కొంగు బంగారం అన్నారు. సింగరేణి బొగ్గుతోనే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నడుస్తున్నాయన్నారు. సింగరేణికి మరిన్ని గనులు కేటాయించాలన్నారు. 

ఎన్ఎండీఆర్ యాక్ట్‌కు ముందు బొగ్గు గనులపై సింగరేణికి పూర్తి అధికారం ఉండేదన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఎన్ఎండీఆర్‌లో కొత్త సవరణను చేపట్టిందన్నారు. 2015లోని ఎన్ఎండీఆర్ సవరణ ప్రకారం సింగరేణి తన హక్కులను కోల్పోయిందన్నారు. అదే సమయంలో బొగ్గు గనుల వేలంలో పాల్గొనడానికి గల కారణాన్ని చెప్పారు. బొగ్గు గనుల వేలాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వేలంలో పాల్గొన్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News